calender_icon.png 15 January, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్కు దిగుమతి సుంకం పెంచుతాం

05-09-2024 12:00:00 AM

కేంద్రమంత్రి కుమారస్వామి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఉక్కు ఉత్పత్తుల దిగుమతులపై ప్రస్తుతం 7.5 శాతం ఉన్న సుంకాల్ని 10 శాతానికి పెంచేలా ఆర్థిక శాఖను ఒప్పిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. చైనా తదితర దేశాల నుంచి వెల్లువెత్తుతున్న చౌక దిగుమతుల నుంచి దేశీయ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు ఈ ప్రయత్నం చేస్తామని బుధవారం ఇండియా స్టీల్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో మంత్రి చెప్పారు. రెండు నెలలుగా పలు ఉక్కు ఉత్పత్తుల తయారీ కంపెనీల ప్రతినిధులు తనతో వారి సమస్యల్ని వివరించారన్నారు. దేశంలోకి చైనా ఉక్కు ఉత్పత్తుల డంపింగ్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సుంకాలు పెంచేలా చూస్తానని హామీ ఇచ్చారు.