- బీజేపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారు
- మూడేళ్లకోసారి పార్టీ కమిటీల పునర్నిర్మాణం
- ప్రతి ఒక్కరూ కొత్తగా సభ్యత్వం తీసుకోవాల్సిందే
- కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): పార్టీ సభ్యత్వాల కోసం జీవిత బీమా సౌకర్యం వంటివాటిని ఇతర పార్టీలు అమలు చేస్తున్నాయని, కానీ బీజేపీలో మాత్రం ఇలాంటి తాయిలాలు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని, పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్న వారంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నవా ళ్లేనని తెలిపారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ సభ్యత్వ నమో దు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు చేసుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీయేనని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి పోలింగ్ బూత్ ఏజెంట్ వరకు ప్రతి ఒక్కరూ మరోసారి సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించారన్నారు. మూడేళ్లకోసారి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ కమిటీల పునర్నిర్మాణం జరుపుకునే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేన న్నారు. మిగిలిన పార్టీలు సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ ఇస్తున్నాయని... దీనిపై చర్చించాలన్నప్పుడు పార్టీ సభ్యత్వం కోసం ఎవరినీ ఏ విధంగానూ మభ్యపెట్టాల్సిన పనిలేదని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించిందన్నారు.
అనేక త్యాగాలు చేసిన పార్టీ బీజేపీ అని అన్నా రు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో బలైన నాయకులు బీజేపీలోనే ఎక్కువ న్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం జనసంఫ్‌ు నాయకులు, కార్యకర్తలు జనతాపార్టీలో స్వచ్ఛందంగా విలీనమైన చరిత్ర తమదన్నారు.
రెండు సీట్ల నుంచి..
నాడు రెండు సీట్లు గెలిచిన పార్టీ.. ఇవాళ దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, ఇది కార్యకర్తల త్యాగం, ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నాలేకున్నా సిద్ధాం తం కోసం పనిచేస్తున్నామన్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం ప్రతి భారతీయుడూ గర్వి ంచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో చేరడంతో పాటుగా మరో వందమందిని చేర్చాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం కోసం కనీసం 100 మందితో సభ్యత్వం చేయించాల్సి ఉంటుందన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 36 శాతం ఓట్లు బీజేపీ సాధించిందని, తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వానికి అండగా నిలిచారని అన్నారు. పోలింగ్ బూత్ కేంద్రంగానే సభ్యత్వ కార్యాచరణ జరుగుతుందన్నారు. ఒక్క సీటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చినా, సిద్ధాంతాలకు అనుగుణంగా నిజాయితీగా వ్యవహరించిన గొప్ప నాయకుడు వాజ్‌పాయి అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆ తరువాత బీజేపీ మరింతగా విస్తరించి బలపడిందన్నారు. బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం నుంచి జిల్లాలు, గ్రామాల్లో సభ్యత్వ నమోదు చేపడుతామని ఎంపీ డీకే అరుణ చెప్పారు.
సభ్యత్వాలు తీసుకున్న సినీ ప్రముఖులు
సినీ నటులు శివకృష్ణ, జీవిత రాజశేఖర్, కవిత, కరాటే కల్యాణితో పాటు సినీ, టీవీ నటులు బీజేపీ సభ్యత్వాలు తీసుకున్నారు. పలువురు రిటైర్డ్ ఆర్మీ, పోలీసు అధికారులు, దివ్యాంగులు, నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువత బీజేపీ సభ్యత్వాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి అరవింద్‌మీనన్, సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్‌తివారీ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి తదితురులు పాల్గొన్నారు.