calender_icon.png 27 February, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి అండగా ఉండండి

27-02-2025 01:44:37 AM

మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ 

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): అభివృద్ధి తమ ధ్యేయంగా ముం దుకు సాగుతున్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. బుధవారం ెుదిర శివారులో ఉన్నటువంటి 150 సంవత్సరాల పురాతన శివాలయంలో  ఐ - మాక్స్ లైట్ ప్రారంభిం చి తదనంతరం శివ పార్వతుల కల్యాణ మహోత్సవంలో చైర్మన్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి ఇంత ముందుచూపుతో అభివృద్ధి పనులను తీసుకుపోతున్నారని, భవిష్యత్తులో మరింత మంచి జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన పనులను ముందుకు తీసుకుపోతూ అందరి మండల పొందుతున్నారని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, శివశంకర్, హనుమంతు, ప్రశాంత్, తిరుమల వెంకటేష్, భారత్, నాగరాజు, శ్రీను, అంజి, గోటూరు రాజు, అఖిల్ రాజు ,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.