తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభిం చిపోయింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. “భారీ వర్షాలతో జీవనోపాధి దెబ్బతిన్నది. తెలుగు రాష్ట్రంలో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర మైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు. మీ కుటుంబ సభ్యుడిగా కోరుతున్నాను. వైరల్ ఫీవర్ ముప్పు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి విపత్తులు వచ్చి నప్పుడు మా అభిమానులు ప్రజలకు, బాధితుల కు అండగా నిలుస్తారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అభిమానులంతా ఐక్యంగా ఉండి ఒకరికొకరు సాయం చేసుకోవాలని కోరుకుంటున్నా” అని చిరంజీవి ట్వీట్ చేశారు.