calender_icon.png 10 January, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా రాణిలా నూరేళ్లిలా ఉండిపో..

04-01-2025 12:00:00 AM

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ అప్‌డేట్స్ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భైరవం’. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లు కథానాయికలుగా నటిస్తున్నారు.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామో హన్ నిర్మిస్తున్నారు. సాయి శ్రీనివాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని మేకర్స్ శుక్రవారం మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. స్టార్ హీరో నాని ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఓ వెన్నెల’ సాంగ్‌ను లాంచ్ చేశారు.

‘ఓ వెన్నెల నీ మాయిలా నాపై ఇలా చల్లిపోకలా.. ఓ వెన్నెల నా రాణిలా నూరేళ్లిలా ఉండిపో ఇలా..’ అంటూ సాగే ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. తిరుపతి జవాను రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల పాడారు.  

‘బీఎస్‌ఎస్12’ 35 శాతం షూటింగ్ పూర్తి

సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘బీఎస్‌ఎస్12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు నిర్మిస్తున్నారు. 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో రూపొందుతోందీ ఒకల్ట్ థ్రిల్లర్.

ఇందులో సంయుక్త ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇప్పటికే 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. అతన్ని అడ్వంచర్ అవతార్‌లో చూపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివేంద్ర; సంగీతం: లియోన్ జేమ్స్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్.