07-02-2025 01:14:06 AM
కేటీఆర్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ సందర్శన సందర్భంగా అనుమతులు లేకుండా డ్రోన్ వినియోగించారంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వ కుంట్ల తారకరామారావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌లపై పోలీసులు నమో దు చేసిన కేసు విచారణను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది.
ఇందులో కౌంట ర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారు అయిన నీటిపారుదల శాఖ సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వలి షేక్‌ను ఆదేశించిం ది. మేడిగడ్డ సందర్శన వ్యవహారంపై పోలీసులు గతేడాది జులై 29న మహదేవపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్, గం డ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలను గురువారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను 12వ తేదీకి వాయిదా వేశారు.