హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : మేడిగడ్డ కుంగుబాటుకు నిర్మాణాలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గత నెలలో ఇచ్చిన మధ్యం తర ఆదేశాలను హైకోర్టు ఈ నెల 22 వరకు పొడిగించింది.
గత నెల 24న జారీ చేసిన మధ్యంతర స్టే ఆదేశాలను జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కింది కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ వేసేందుకు గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణ ఈ నెల 22కి వాయిదా వేశారు.