calender_icon.png 30 October, 2024 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సల్మాన్‌కు దూరంగా ఉండు

29-10-2024 12:00:00 AM

పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఈ గ్యాంగ్ బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌కు వార్ని ంగ్ ఇచ్చినట్టు జాతీయ మీడియా తెలిపింది. బాలీవుడ్ నేత సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరం గా ఉండాలని పప్పూయాదవ్‌ను బిష్ణో య్ గ్యాంగ్ హెచ్చరించింది. తమ హెచ్చరికలను పట్టించుకోకుంటే చంపేస్తామని బెదిరించింది. పప్పూ యాదవ్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు వెల్లడించింది.

సాధ్యమైనంత త్వరగా బిష్ణోయ్‌తో సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ యాదవ్‌కు ఆడియో మెసేజ్ వచ్చిందని పేర్కొంది. దీనిపై ఆయన పోలీసులను సంప్రదించినట్లు కథనాలు పేర్కొన్నాయి.