06-02-2025 12:00:00 AM
సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట కరుణాకర్
నల్లగొండ, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : యువత మత్తుకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని టీం భరోసా సర్కిల్ ఇన్స్పెక్టర్ కోట కరుణాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
గంజాయి సేవించినా, రవాణా చేస్తూ పట్టుబడినా పదేండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్కు డ్రగ్ కిట్టు అందించిందని దీంతో 22 రకాల డ్రగ్స్ను గుర్తించొచ్చని తెలిపారు.
ఎక్సైజ్ ఎస్‌ఐ విజయ్ కుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూత్ కోఆర్డినేటర్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర అధికారి ప్రవీణ్ సింగ్, పెరిక సంపత్ కుమార్, కొండానాయక్, ప్రసాద్, బాబురావు, ఎన్సీసీ 31 బెటాలియన్ క్యాడెట్లు, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.