calender_icon.png 19 January, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంభు సరిహద్దుపై యథాతథ స్థితి

25-07-2024 01:36:33 AM

న్యూ ఢిల్లీ, జూలై 24: రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా మూసేసిన శంభు సరిహద్దు లో యథాతథ స్థితిని కొనసాగించాలని పం జాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల నేపథ్యం లో.. దీనిపై స్టే విధించాలని హర్యానా ప్రభు త్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు బెంచ్ బుధవారం సంచలన ప్రకటన చేసింది. ఈ తీర్పు వెలువడే వరకు శంభు సరిహద్దు వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ము ందుగా రైతులతో మాట్లాడేందుకు  స్వతంత్ర ప్యానెల్‌ను నియమించాలని జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్ లతోకూడిన ధర్మాసనం పేర్కొంది. సూచనలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలను కోరింది.  ప ంజాబ్ రైతులను ఢిల్లీ వెళ్లకుండా నిరోధించడానికి హర్యానా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెం డు రాష్ట్రాల సరిహద్దులో బారికేడ్లను ఏర్పాటు చేసింది. హర్యానా తరఫున లాయర్ మాట్లాడుతూ.. నిరసనకారుల వద్ద వందలాది జేసీబీలు, ట్రాక్టర్లు ఉన్నాయని వాటితో వారు ఢిల్లీలోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు.