calender_icon.png 22 March, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు టెండర్‌పై స్టేటస్‌కో

21-03-2025 12:34:45 AM

విచారణ ఏప్రిల్ 15కు వాయిదా 

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుం చి ఆమనగల్ రీజినల్ రింగ్ రోడ్డు దాకా మొ దటి ఫేజ్‌లో ఏర్పాటు చేయదలచిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి చెందిన టెండర్ నోటీసుపై స్టేటస్‌కో కొనసాగించాలంటూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరి 24 న జారీ చేసిన టెండర్ నోటీసును సవాలు చేస్తూ ఎన్ రవీందర్ మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి భూసేకరణ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉన్నందున గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణా నికి చెందిన టెండర్‌పై యథాతథాస్థితిని కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు.