ఎంపి పొరిక బలరాం నాయక్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రెడ్ తీగల సత్యనారాయణ
ఎమ్మెల్యే మురిళినాయక్
మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తీగల సత్యనారాయణ ఆశయాలను కొనసాగించాలని, నాడు భూములను అక్రమించుకున్న భూస్వాములకు వ్యతరేకంగా పోరాటం చేస్తూ ఎంతో సేవ చేశారని మానుకొట ఎంపి పోరిక బలరాం నాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా కామ్రెడ్ తీగల సత్యనారాయణ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురిళినాయక్‌తో కలసి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపి బలరాంనాయక్ మాట్లాడుతూ కామ్రెడ్ తీగల సత్యనారాయణ మహబూబాబాద్ జిల్లా జన్మించారని ఆయన ఉన్నత విద్యలో న్యాయవాదగా భూస్వాములు పేద రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తూ వారి భూములను అక్రమించుకుంటే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారని 1967లో మానుకోటకు తొలి ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్లి మానుకోట నియోజకవర్గం పేదలకు భూ పంపిణీ, పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్న సందర్భంలో ఫిల్టర్ బెడ్‌ను నిర్మించి మానుకోట ప్రజలకు మంచినీటిని ఇంటి ఇంటికి అందించిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందని అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రెడ్ తీగల సత్యనారాయణ: ఎమ్మెల్యే మురిళినాయక్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రెడ్ తీగల సత్యనారాయణ అని ఆయన పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. సీపీ ఐ శతాభ్ది ఉత్సావాల్లో భాగంగా ఎంపీ బలారంనాయక్‌తో కలిసి పాల్గొని మాట్లాడుతూ కామ్రెడ్ తీగల సత్యనారాయణ కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే మానుకోట ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందించారని అన్నారు. ఆయన జ్ఞాపకార్ధంగా స్మారకచిహ్నం నిర్మించి ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో మిషన్ భగీరధ పనులను అసంపూర్తిగా చేశారని అన్నారు. కాగా ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి సమచారం ఇవ్వకు మానుకోట మంచి నీటి సమస్య తీరేందుకు 20కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్, సీపీ ఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి, కొత్తగూడ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.