పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు తెలిపారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే విగ్రహం పనులు ప్రారంభవుతాయని, ఆగస్టు 20న విగ్రహ ఆవిష్కరణ ఉంటుందన్నారు. వీహెచ్ వెంట హెచ్‌సీఏ కార్యదర్శి సీజే శ్రీనివాస్, సభ్యులు భాస్కర్, విగ్రహ రూపకర్త రాజు ఒడియార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు.