calender_icon.png 29 December, 2024 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్

03-12-2024 12:40:56 AM

ఆటో, క్యాబ్ డ్రైవర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్ బీ వెంకటేశ్

ముషీరాబాద్, డిసెంబర్ 2: ఆటో డ్రైవర్‌ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలంగాణ ఆటో, క్యాబ్ డ్రైవర్స్ సంఘాల జేఏసీ కన్వీనర్ బీ వెంకటేశ్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం హిమాయత్‌నగర్ ఏఐటీయూసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలతో కలిసి ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన బంద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వెంకటేశ్ మాట్లాడుతూ సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు లక్ష మంది కార్మికులతో మహాప్రదర్శన చేపడతామన్నారు.