calender_icon.png 6 January, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజనీతిజ్ఞుడు మర్రి

03-12-2024 03:29:37 AM

ముషీరాబాద్, డిసెంబర్ 2: దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి.. గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడని రాజనీతిజ్ఞుడని పలువురు వక్తలు కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి 28వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఇందిరాపార్కులోని చెన్నారెడ్డి మెమోరియల్ రాక్‌గార్డెన్స్‌లో..

ఆయన తయనయుడు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు, మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు హాజరయ్యారు.

చెన్నారెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, దత్తాత్రేయ మాట్లాడుతూ.. మర్రి చెన్నారెడ్డి ముందుచూపు ఉన్న వ్యక్తి అని, గొప్ప పరిపాలనా దక్షుడు అని అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీ, చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.