calender_icon.png 24 January, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాల హక్కులు కాలరాసేలా

24-01-2025 01:46:30 AM

యూజీసీ ముసాయిదా 

మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): యూజీసీ రూపొందించిన ముసా యిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉం దని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి వాపోయారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ యూజీసీ ముసాయి దాపై మార్పులకు సంబంధించి అభిప్రాయాలను ఈ నెల 30లోగా తెలియజే యాలని రాష్ట్రాన్ని కోరిందని, అభిప్రాయా లు చెప్పేందుకు ఇంకా వారం రోజుల సమయమే ఉన్నా రాష్ర్ట ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇంత ముఖ్యమైన అంశంపై సమీక్ష చేసే సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు.