calender_icon.png 1 April, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు

27-03-2025 12:12:27 AM

లోక్‌సభలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని బుధవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశకు ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం చెప్పారు. ఎంపీ దయానిధి మారన్ లోక్‌సభలో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకొనే విషయమై కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా? అని ఘాటుగా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వైష్ణవ్ బదులిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు రాష్ట్రాలకు లేదన్నారు. ఈ అంశంపై చట్టాలు రూపొందించుకొనేందుకు రాజ్యాంగం రాష్ట్రాలకు నైతిక, చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కేంద్రం ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ వందల వెబ్‌సైట్లను ఫ్రీజ్ చేసింది. మనీ ప్లాట్‌ఫామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎవరూ వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది.