calender_icon.png 25 October, 2024 | 7:57 AM

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా!

25-10-2024 02:04:06 AM

కేంద్రం గ్రీన్ సిగ్నల్ 

ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు

ప్రధాని మోదీ, అమిత్‌షాతో 

సీఎం ఒమర్  భేటీ

రాష్ట్రహోదాపై క్యాబినెట్ తీర్మాన కాపీ అందజేత

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జాతీ య మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. షాతో భేటీలో పలు కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలని ఇటీవల రాష్ట్ర క్యాబనెట్ తీర్మానించింది. క్యాబినెట్ తీర్మాన కాపీని ఒమర్ అబ్దుల్లా.. అమిత్‌షాకు అందించారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని అమిత్‌షా వెల్లడించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కేంద్రంతో ఎలాంటి ఘర్షణలు అక్కర్లేదని, సుపరిపాలన, జమ్ముకశ్మీర్ అభివృద్ధికి కేంద్రంతో నిర్మాణాత్మక సం బంధాల కోసం కృషిచేస్తానని స్పష్టం చేశారు. కాగా జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇటీవల అక్కడ  ఎన్నికలు జరిగాయి.