calender_icon.png 7 January, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం

06-01-2025 01:26:04 AM

శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి ): రాష్ట్రంలో బీసీలంతా ఏకమై తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సంఘటితం కావాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్  సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ఆదివారం ఘట్‌కేసర్‌లోని జేకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర’ అంశంపై బీసీ ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సుకు హాజరై  మాట్లాడా రు.

బీసీ నేతలను ఐక్యం చేసేందుకు కుల సంఘాల నేతలు కృషి చేయాలని సూచించారు. ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో బీసీలు అభ్యర్థులుగా నిలబడి గెలవాలని  సూచించారు.  బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని కచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివరించారు.

తుల ఉమ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ్ల స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తే ప్రజలు గెలిపిస్తారని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్  మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారానికి మూలం స్థానిక సంస్థలని వాటిని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంటా రాముల యాదవ్ తన అనుభవాలను వివరించారు. ప్రముఖ బీసీ నాయకులు బత్తుల సిద్దేశ్వరులు పటేల్, వట్టే జానయ్య తదితరులు పాల్గొన్నారు.