calender_icon.png 2 February, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆర్టికల్ 3 పొందుపరచకపోతే రాష్ట్రం వచ్చేది కాదు

01-02-2025 11:24:06 PM

బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కు పూర్తి మద్దతు ఇస్తుంది..

ఈసారి బీహార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు..

సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డ్ రంగదాంపల్లి లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజి మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు..

సిద్దిపేట: భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పొందుపరచకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు శనివారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హరీష్ రావువిష్కరించి మాట్లాడారు. అనేక చోట్ల ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహం నిలబడి ఉంటే రంగదాం పల్లిలో ఏర్పాటుచేసిన విగ్రహం కూర్చొని ఉందని అన్నింటికీ భిన్నమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆకర్షించే విధంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఎంత ముఖ్యమో ఆయన ఆశయాలను కొనసాగించడం అంతే ముఖ్యమని సూచించారు. నేటి యువత అయన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కేసిఆర్ దళిత బందు రూ.10లక్షలతో ప్రారంభిస్తే నేటి ప్రభుత్వం దానిపై ఉలుకు పలుకు లేదని ఇస్తామని ఇయ్యమని ఏది చెప్పని విధంగా ఉండటం మోసానికి నిదర్శనం అన్నారు.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసిఆర్ పెడితే రేవంత్ రెడ్డి బేడీలు వేసాడానీ, భేషజాలకు పోకుండా రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం అందురు చూసేలా అవకాశం కల్పించాలని కోరారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని కేసిఆర్ ప్రారంభించారాని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14నెలలు గడిచిన అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదల చేయలేదాని చెప్పారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో మంచి పథకాలు తెచ్చారు వాటిని కేసిఆర్ అమలు చేశారని కానీ అదే పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఉన్న పథకాలు అమలు చేయక కొత్త పథకాలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. అంబేద్కర్ విగ్రహం లేని ఊరు సిద్దిపేట నియోజక వర్గంలో ఉండ వద్దని అంతట విగ్రహాలు ఏర్పాటు చేశామని చెప్పారు. భారతదేశ బడ్జెట్ తుంగలో తొక్కేలా ఉందని విమర్శించారు. నిర్మల సీతరామన్ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాకుండా కొన్ని రాష్ట్రాలకూ అన్నట్లుగా బడ్జెట్ రూపొందించారని, పోయినసరి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండిచేయి చూపారని చెప్పారు. ఈ బడ్జెట్ బీహార్ బడ్జెట్ బడేబాయ్ అని మోడీని రేవంత్ మెచ్చుకుంటున్నారు. కానీ బడేబయ్ ఈ చోటే బాయ్ నీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ లో వర్గీకరణ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణ కమిటీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.