10-03-2025 12:29:47 AM
జిల్లా రెండో మహాసభను విజయవంతం చేయండి
రంగారెడ్డి, మార్చి 9 (విజయ క్రాంతి): టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా రెండవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌లు పిలుపు నిచ్చారు. ఈ నెల 11 మంగళవారం శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దటూరు శివారులోని ప్రగతి రిసారట్స్ లో నిర్వహి స్తున్న జిల్లా రెండవ మహాసభకు మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి ,మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి నరేందర్ రెడ్డి లు ముఖ్య అతిథులు గా రానునట్లు చెప్పారు.
ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో 25 సంవత్సరాలకు పైగా విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ మహాసభల సందర్భంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు హాజరు కావాలని వారు కోరారు.