calender_icon.png 22 January, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఏర్పాటు

03-12-2024 12:02:20 AM

హైదరాబాద్, డిసెంబర్2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వన్యప్రాణు లను సంరక్షించేందుకు ప్రభుత్వం వైల్డ్ లైఫ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు చైర్మన్‌గా సీఎం, వైస్ చైర్మన్‌గా అటవీ శాఖ మంత్రి వ్యవహరి స్తారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీ కృష్ణ, మురళీనాయక్, రాందాస్ మా లోత్‌లను నియమించారు.

ఇతర సభ్యులుగా అటవీశాఖకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ సహా ఇతర అధికారులు వ్యవహరిస్తారు. వన్యప్రాణుల సంరక్షణలో ఈ బోర్డు సలహాలు, సూచనలు చేస్తుంది. వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ బోర్డు పనిచేయ నుంది. ఈ బోర్డు మూడేళ్ల పాటు పనిచేస్తుంది.