క్రీడలు, వసతులపై ఆరా
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): రాష్ర్టంలో యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ అధ్యక్షతన మెల్‌బోర్న్‌లో ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. క్రీడలు, మౌలిక వసతులు, ఇతర అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై చర్చించారు. ఆస్ట్రేలియాలో క్రీడాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహకారంతో పాటు అత్యాధునిక సాంకేతిక శిక్షణ అందిస్తున్నట్లు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, శివసేనారెడ్డి , సోనీ బాలా, మహ్మద్ ఖురేషి, ఎంపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.