calender_icon.png 22 September, 2024 | 12:45 PM

విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం

22-09-2024 10:32:02 AM

గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

దౌల్తాబాద్/ దుబ్బాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి బిసి మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను, మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలువ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం తనిఖీ చేశారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు, వసతుల గురించి ప్రతి తరగతి గదికి వెళ్లి సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని  అన్నారు.

విద్యుత్ సమస్య, మరుగుదొడ్లు‌, డైనింగ్ ఆల్ శిథిలవస్థకు చేరిందని  కొత్త భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు అలాగే లైబ్రరీ, ఫర్నిచర్, హాస్టల్ ప్రధాన గేటు నుండి హాస్టల్ వరకు  సిసి రోడ్లు నిర్మించాలని, అల్వాల గురుకుల పాఠశాలలో కాంపౌండ్ వాల్ పలుచోట్ల లేదని మరుగుదొడ్లు స్నానపు గదుల అసౌకర్యంగా ఉన్నాయని, పాఠశాల ఆవరణలో కోతుల బెడద విపరీతంగా ఉందని పలుమార్లు విద్యార్థులపై దాడికి ఎత్తించాయని తాగునీరు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల డిస్టిక్ కో ఆర్డినేటర్ అశోక్ బాబు పాఠశాల ప్రిన్సిపాల్ రఘునందన్ రావు, బిపిఎల్ పేరెంట్స్ కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మెట్ల శంకర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గాజుల బాబు పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు మల్లేశం పేరెంట్స్ నరేందర్, దుర్గయ్య,  మీరుదొడ్డి ఎంపీపీ రాజులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ రహీముద్దీన్, బండారు దేవేందర్, పూజిత వెంకటరెడ్డి,  శివకుమార్ కనకరాజు, డప్పు శివరాజు, ఉపాధ్యాయులు  తదితరులు పాల్గొన్నారు.