calender_icon.png 18 November, 2024 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనతోనే రాజ్యాధికారం

18-11-2024 12:11:19 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వీహెచ్

ముషీరాబాద్, నవంబర్ 17 : 78 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో బీసీలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాటా దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇప్పటివరకు 120 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని, అయితే బీసీల వాటా కోసం ఒక్కసారి కూడా ఎలాంటి సవరణ జరగలేదన్నారు.

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్‌తో ఈనెల 25న రవీంద్రభారతిలో ‘బీసీల సమరభేరి’ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షే మ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీల సమరభేరికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, బీసీ సంఘాల నాయకులతో కలిసి కృష్ణయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలు కనిపించని దోపిడీ, వివక్ష, అణిచివేతకు గురవుతున్నారన్నారు. రాజ్యాధికారం కోసం శాంతియుత పోరాటాలకు బీసీలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక తరం పోరాడితే, భవిష్యత్ తరాలు బాగుపడుతాయన్నారు.

రాజ్యాంగాన్ని సవరణ చేసి పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవీంద్రభారతిలో జరిగే బీసీల సమరభేరి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా బీసీలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వీహెచ్ మాట్లా డుతూ.. బీసీలకు న్యాయం జగగాలంటే దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణ న జరగాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, నాయకులు.. నందగోపాల్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, ర్యాగ రమేష్, రాందేవ్ మోడీ, నిమ్మల వీరన్న, ఉదయ్ నేత, జిల్లపెల్లి అంజి, అనంతయ్య, రఘపతి, పరుశురామ్, రవి, చిక్కుడు బాలయ్య, జయంతి తదితరులు పాల్గొన్నారు.