రాజ్యాధికారం సాధించాలంటే కొందరికి డబ్బు, ఇంకొందరికి కులం, మరికొందరికి రిజర్వేషన్లు కావాలి. ఇందులో కింది వర్గాల కు కనీసం గ్రామీణ స్థాయిలోనైనా కుర్చీ ఎక్కాలంటే రిజర్వేషన్లు మా త్రమే పెద్దదిక్కు. ఇక్కడ ఏ రిజర్వేషన్లు కూడా కింది సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేయట్లేదు. కారణాలు గ్రామీణ స్థాయిలో అనేక రకాల సమస్యలు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజ్యం ఎవరి చేతుల్లోకి రాత్రికి రాత్రే వచ్చి వాలిపోదు. దానివెను క ఎన్నో పోరాటాలు, ఎంతో మేధోమథనం జరిగి పునాదుల నుండి కదిలొస్తేనే సా ధ్యమవుతుంది. ఇంత రాజకీయ చైతన్యం వచ్చినా ఇంకా పల్లెల్లో ఆధిపత్య సమాజం కింద నలిగిపోయే బీసీల సమాజం ఉంది.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా కొన్ని స్పష్టమైన హామీలనిచ్చింది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు జనాభా దామా షా ప్రకారం ఇవ్వాలంటే ఖచ్చితంగా కులగణన చేసి తీరాల్సిందే. లేదంటే బీసీ సమాజం పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలనేది రాజ్యాం గబద్ద నిర్ణయం. 50 శాతం రిజర్వేషన్లు దాటకూటదనేది సు ప్రీంకోర్టు విధానం. ఇప్పుడు కులగణన చేస్తే బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వాలంటే సుప్రీంకోర్టు లైను దాటాల్సిందే.
కేంద్రంలో గత ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ సీలింగ్‌ను బ్రేక్ చేస్తూ 10 శాతం రిజర్వేషన్లు కొత్తగా ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో వి విధ రాష్ట్రాలలో రిజర్వేషన్లు 60శాతం పైగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో కలిపి 75 శాతం ఉన్నాయి. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 23శాతానికి కుదించి ఎన్నికలు జరిపింది. ఇదొక తీరని అన్యాయం. సు ప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఆ విధానం మార్చుకోలేదు. రిజర్వేషన్లు తగ్గించే అధికారం రాష్టానికి ఉంటుంది కానీ పెంచే అధికారం కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతానికి పెంచుతామనే హామీ ఇప్పటికీ సత్యదూరమే.
తెలంగాణ రాష్ట్రంలోఎస్సీ, ఎస్టీల తరువాత అత్యంత హేయమైన బతుకులు బీ సీ కులాలవే. దీంట్లో కొన్ని కులాలు ఇంకా దళిత సమాజంకన్నా ఇం కా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా వందకు పైగా బీసీ కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు లెక్కగట్టి వాళ్ల జీవన విధానాన్ని బయటికి తీస్తేనే సరైన ఆధారాలు లభిస్తాయి లేదంటే మరొక్కసారి తీరని అన్యాయం తప్పదు.అందుకేఅణగారిన వర్గాల ప్రజలు చట్టాలు చేసే అసెంబ్లీలో పార్లమెంటులో ఉంటేనే వారికి రాజ్యాంగ ఫలాలు దక్కి రేపటి తరాలు రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. -
అవనిశ్రీ, హైదరాబాద్