20-04-2025 04:52:35 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆదివారం డైరెక్టర్ జనరల్ పోలీస్ సివి ఆనంద్(Director General of Police CV Anand) దంపతులు, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దేవాలయం ప్రధాన ద్వారం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు అధికారులు. అనంతరం ప్రధాన దేవాలయంలో సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి దేవాలయంలో వేద పండితులు అర్చకులు వేద ఆశీర్వచం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట భద్రాచలం ఎఎస్పి విక్రాంత్ సింగ్ పాటిల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.