మేడిపల్లి (విజయక్రాంతి): కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వరుడని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మూడు చింతలపల్లి మండల్ ఉద్దమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన సుప్రభాత సేవ, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బొమ్మపల్లి నర్సింహా యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా RTO మెంబెర్ భీమిడి జైపాల్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మెన్ ఆడెపు ఉమా మహేశ్వరి, ఉద్దమర్రి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.