calender_icon.png 23 November, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యాధునిక చికిత్స

30-10-2024 12:06:36 AM

యశోద గ్రూప్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): బ్రెయిన్ స్ట్రోక్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ ఐజీ రమేష్ మస్తీపురం అన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించడం, పొగతాగడం, బీపీ, షుగర్, స్థూలకాయం వంటి సమస్యలతో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. యశోద గ్రూప్ డైరెక్టర్ డా.పవన్ గోరుకంటి మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకోసం ‘మెకానికల్ థ్రోంబెక్టమీ’ అనే విధానం అందుబాటులోకి వచ్చిందని.. ఇది అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను కాపాడుతోందని చెప్పారు.

న్యూరాలజీ డా.ఆర్.ఎన్ కోమల్‌కుమార్ మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రక్త నాళాలను తిరిగి తెరవడానికి రెండు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ చికిత్సల వల్ల పక్షవాతం నుంచి త్వరగా కోలుకునే అవకాశముందన్నారు. ఈ సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ల కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన వైద్య చికిత్స విధానాలపై యశోద ఆసుపత్రి బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ ఆకట్టుకుంది.