02-03-2025 04:33:29 PM
మంథని (విజయక్రాంతి): అజాతశత్రువు శ్రీపాద రావు అని మంథనిలో రోగులకు పండ్లు పంపిణీలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని రావు చెరువు కట్టలో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, శ్రీపాద చౌరస్తాలో శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు పూలమాలవేసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. అలాగే మంథని బస్టాండ్ లో మజ్జిగ ప్యాకెట్ లో పంపిణీ చేసి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు అందజేశారు.