పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో శ్రీ.సీతారాంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ & పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో మంగళవారం శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సి.జి.యఫ్ ద్వారా రూ. 50,00,000/- లక్షల రూపాయల నిధులతో దేవాలయ అభివృద్ధి పనులకు మంత్రి సురేఖ విజయరమణా రావుతో శంకుస్థాపన చేశారు.
మంత్రి కొండా సురేఖ తొలిసారిగా రాఘవపూర్ వద్ద రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. రాఘవపూర్ నుండి సబ్బితం గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రి, ఎమ్మెల్యే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మంత్రిని, ఎమ్మెల్యే ను వెందమంత్రాల సాక్షిగా ఆశీర్వాదహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పలు గ్రామాల మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.