calender_icon.png 11 January, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి రాష్ర్ట స్థాయి సైన్స్ ఫెయిర్

07-01-2025 12:19:57 AM

జడ్చర్ల, జనవరి 6 : నేటి నుంచి జరుగుతున్న రాష్ర్టస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. సోమవారం జడ్చర్ల  మండలం పోలేపల్లి సెజ్ లోని ఎస్.వి.కె.యం పాఠశాల లో జరుపుతున్న సైన్స్ ఫెర్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు.

రాష్ర్టంలోని 33 జిల్లాల నుండి విద్యార్థులు ఉపాధ్యాయు లు వస్తున్నందు వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్, కుమార్, డిఎస్‌ఓ శ్రీనివాస్, జడ్చర్ల మండల విద్యాధికారి మంజులాదేవి, ఎస్‌వి కేయం పాఠశాల ప్రిన్సిపల్ నిజార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.