హైదరాబాద్‌కు 67 బంగారు పతకాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): కరీంన జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీసులు 9 ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్స్‌తో పాటు 67 బంగారు పతకాలు, 32 రజత పతకాలు, 23 కాంస్య పతకాలు సాధించారు.
పోలీస్ క్రీడాకారులకు సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం అభినందనలు తెలిపి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎన్ భాస్కర్, కిష్టయ్య, ఏసీపీ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.