మునుగోడు (విజయక్రాంతి): సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాతృమూర్తి నెల్లికంటి పార్వతమ్మ దశదినకర్మకు హాజరైన వివిధ పార్టీల రాష్ట్రస్థాయి నాయకులు మండలంలోని వారి స్వగ్రామం ఎలగలగూడెంలో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, బిజెపి నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు బోర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మీ రెడ్డి శ్యాం ప్రసాద్ రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, జల సాధన సమితి అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ, రచయిత ప్రిన్సిపాల్ డాక్టర్ బిల్లీ యాదయ్య యాదవ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేష, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, నల్లగొండ, భువనగిరి యాదాద్రి, జిల్లా రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.