పోటీల్లో పాల్గొననున్న 34 జిల్లాల జట్లు..
ఆదిలాబాద్: జిల్లాలో 71వ రాష్ట్ర స్థాయి పురుషుల సీనియర్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం చేపట్టిన ఈ పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉష్కం రఘుపతి ప్రారంభించారు. పోటీలకు 34 జిల్లాల జట్లు హాజరయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. అతిథులు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకొని, అనంతరం క్రీడా పథకాన్ని ఆవిష్కరించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అధ్యక్షుడు ఉష్కం రఘుపతి మాట్లాడుతూ... ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు, కోచ్ మేనేజర్లు, పాల్గొన్నారని పేర్కొన్నారు.