calender_icon.png 18 March, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరాహోరీగా సాగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ పోటీలు

17-03-2025 08:35:54 PM

సెమీస్ చేరిన కరీంనగర్ జిల్లా జట్టు.

హుజురాబాద్ (విజయక్రాంతి): హోరాహోరీగా సాగుతున్న సీనియర్ క్రీడాకారుడు మోట పోతుల రమేష్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి 8వ డిస్టిక్ సీనియర్ మెన్ హాకీ పోటీలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ క్రీడా మైదానంలో సోమవారం తుది అంకానికి చేరుకున్నాయి. సెమీఫైనల్స్ కరీంనగర్ వర్సెస్ మెదక్, హైదరాబాద్ వర్సెస్ నిజాంబాద్ జట్టు సెమీఫైనల్ కు చేరాయి. మంగళవారం ఉదయం ఏడు గంటలకు సెమీఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ తోట రాజేంద్రప్రసాద్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ కార్యదర్శి గనిశెట్టి ఉమామహేశ్వర్ తెలిపారు.

ఈ మ్యాచ్లకు సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్రావు క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించాడరు. సోమవారం జరిగిన మ్యాచ్లలో గ్రూప్ ఎ లో వరంగల్ వర్సెస్ ఖమ్మం తలపడగా ఖమ్మంపై వరంగల్ జిల్లా జట్టు 9-1తో గెలుపొందింది. హైదరాబాద్ వర్సెస్ రంగారెడ్డి జిల్లా తలపడగా హైదరాబాద్ 4-3 తో విజయం సాధించింది. వరంగల్ వర్సెస్ కరీంనగర్ జిల్లా జట్లు తలపలగా కరీంనగర్ 1 -0 తో విజయం సాధించింది. ఖమ్మం వర్సెస్ రంగారెడ్డి జట్లు తలపడగా1-0 రంగారెడ్డి విజయం సాధించింది. గ్రూప్ బి లో నల్గొండపై మహబూబ్నగర్ 16-2 తో విజయం సాధించింది. అదిలాబాద్ పై నిజామాబాద్ 2-0 విజయం సాధించింది. మెదక్ పై మహబూబ్నగర్ జట్టు3-1 తో విజయం సాధించింది.

నల్గొండ పై నిజాంబాద్ 12-2 తో విజయం సాధించింది. అదిలాబాద్ మెదక్ జట్లు తలపడగా చెరొక రెండు గోల్స్ చేసి డ్రాగ ముగించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ సర్దార్ సురేందర్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు పవన్ కుమార్, చింత శ్రీనివాస్, భూసారపు శంకర్, వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి శ్రీనివాస్, భీమగోని సురేష్, టి శ్రీనివాస్, బి తిరుపతి గౌడ్ వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, రమేష్, సాయి కృష్ణ, రాజేష్, విక్రం, సాంబ, కరీంనగర్ జిల్లా జట్టు కోచ్ ఎం రాజేష్, మేనేజర్ వినయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.