calender_icon.png 23 December, 2024 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి గౌడ జన హక్కుల పోరాట సమితి సమావేశం

23-12-2024 05:04:04 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్ణాల్ పల్లి గ్రామంలో గౌడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాగుల సిద్దిరాములు గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించిన గ్రామాలలో పోటీచేయాలని, ఎక్సైజ్ శాఖ వారు మన గౌడ కులస్తులను చిన్న చూపు చూస్తున్నారని ఇప్పటికైనా అధికారులు తమ ధోరణి మార్చుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సిములు గౌడ్, రాష్ట్ర ట్రైజ రర్ బాలేషం గౌడ్, జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ బాలాగోని రేక గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ గౌడ్, రాష్ట్ర ప్రచారకార్యదర్శి సింగితా నర్సాగౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొండగౌని రవీందర్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి సాయి గౌడ్, రాష్ట్ర మహిళ కార్యదర్శి బుచ్చంగారి భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు అకుల మల్లేశం గౌడ్, చేగుంట మండల గౌడ్ సంఘము అధ్యక్షులు మారబోయిన స్వామి గౌడ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.