26-03-2025 01:47:02 AM
హనుమకొండ, మార్చి 25 (విజయ క్రాంతి): భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎస్ ఎఫ్ ఎ సి సహకారంతో వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారు సంఘంల నేతృత్వంలో వరంగల్ రంగశాయిపేట్ లో జి ఎం కన్వెన్షన్ నందు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల మేళ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మేళాను తేదీ 25 నుండి 27 తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తుల మేళ, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కావున రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అందరు ఈమేళ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ నాడైనా నేడైనా రైతుల పక్షం వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నేడు కూడా ఇందరమ్మ రాజ్యంలో రైతులకు 2 లక్షల రుణ మాఫీ, వ్యవసాయ అనుభందరంగాలకు ప్రముఖ్యతనిచ్చి సబ్సిడిలను పెంచి రైతులకు అండగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రైతు యొక్క ఉత్పత్తిని పెంచడం పెరిగిన ఉత్పత్తిలకు అధిక రాబడి పొందుటకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం ఈ మేళ యొక్క ముఖ్య ఉదేశం. ఆయిల్ ఫార్మ్ సాగు పై రైతులకు అవగాహన కలిపించడం ఆయిల్ ఫార్మ్ పంట దిగుబడి తో వచ్చే లాభాలు,ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేస్తారు. ఎఫ్ బి ఓ ల ఏర్పాటు,వాటి నిర్వహణ ఉత్పత్తి, ప్రాసెసింగ్ మార్కెటింగ్,సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాల పై రైతులకు అవగాహనా కలిపిస్తారు.
కూడా చైర్మన్ ఇనగాలవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఉత్పత్తి చేసిన గృహ,వంటగది అవసరాలు ఆరోగ్యకర అల్పహారాలు, అందం, ఆరోగ్య సంరక్షణ ఇలా మరెన్నో సహజ సిద్ధమైన మేలైన ఉత్పత్తులను ఆసక్తి ఉన్న ప్రజలు కొనుగోలు చేయుటకు, రైతుల యొక్క ఉత్పాదకతను పెంచడానికి ఉత్పత్తులను మార్కెట్ అనుసంధాల ద్వారా అధిక రాబడి ఆదాయం పెంపొందించుటకు కొత్త ఎఫ్ పి ఓ లు ఏర్పడిన సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఎఫ్ పి ఓ నిర్వహణ ఉత్పత్తి ప్రాసెసింగ్ విలువ మార్కెట్ కేజీలు సాంకేతిక పరిజ్ఞానం ఇలా మొదలైన అంశాలు మద్దతిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యసరదాదేవి, వ్యవసాయ అధికారులు, రైతు ఉత్పత్తిదారులు, రైతులు పాల్గొన్నారు.