calender_icon.png 27 December, 2024 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం గురించి నిజం చెబితే.. దేశాన్ని విభజించడమా..?

05-11-2024 07:29:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బోయిన్ పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని ఒప్పుకుందామని,  తనే కులగణన పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నంటు విపక్షానేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం గురించి నిజం చెబితే.. దేశాన్ని విభజించడమా..? అని ప్రశ్నించారు. కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై, ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నామో స్పష్టత వస్తుందన్నారు.

పార్లమెంట్ లో కులగణన చేస్తామని స్పష్టంగా చెప్పినట్లు రాహుల్ గుర్తుచేశారు. రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామని చెప్పారు. దీంతో తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులు నిర్ణయించాలని సూచించారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయన్నారు. అంటరానితనం అనేది భారతదేశంలో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని, అదే విధంగా దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.