calender_icon.png 28 October, 2024 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలను జయప్రదం చేయాలి

28-10-2024 12:49:52 PM

ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను జయప్రదం చేయాలని హ్యాండ్ బాల్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి 38వ హ్యాండ్ బాల్ పోటీలను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నవంబర్ 2 ,3, 4 తేదీలలో ఉమ్మడి పది జిల్లాల లోని 180 మంది క్రీడాకాలతో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ క్రీడలను కీర్తిశేషులు గడిగుంపుల సదానందంను స్మరించుకుంటూ ఆయనకు ఈ క్రీడలను అంకితం చేయడం జరుగుతుందన్నారు. క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 రాష్ట్రస్థాయి పోటీలు ,1 జాతీయస్థాయి పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. 2007లో గోనె శ్యాంసుందర్ రావు ఆధ్వర్యంలో అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హ్యాండ్ బాల్ క్రీడలను విస్తృతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి అడుగువెళ్లి రమేష్ రెడ్డి, గిరిజన క్రీడ జిల్లా అధికారి బండ మీనా రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు జంగు, కోచ్ లు అరవింద్, రాజలింగు, సాయి, రాకేష్, పిఈ టి లు అరవింద్, పాండురంగ్  తదితరులు పాల్గొన్నారు.