30-03-2025 06:41:33 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణమును పురస్కరించుకొని దేవస్థానం రూపొందించిన శ్రీరామనవమి కళ్యాణ స్వాగత గీతాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana State Governor Jishnu Dev Verma) లాంచనంగా హైదరాబాదులో ప్రారంభించారు. ఈ గీతాన్ని భద్రాచలం దేవస్థానం రామాయణ పారాయణదారు ఎస్టిజి అంతర్వేది కృష్ణమాచార్య రచించగా నేమాని పార్థసారథి బృందం గానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, సూపర్డెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు గోపి, తదితరులు పాల్గొన్నారు.