calender_icon.png 19 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

27-03-2025 12:33:36 AM

* రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా 

-* మైనార్టీ గురుకుల విద్యార్థులకు కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు

మహబూబ్ నగర్ మార్చి 26 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభు త్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రం భగీరథకాలనీలోని మైనార్టీ బాలికల గురుకుల1, 2, 3 పాఠశాల సముదాయంలో కింగ్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో బుధవారం కరాటే శిక్షణ తీసుకున్న బాలికలకు కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం కోసం ఇటీవలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆత్మరక్షణ కోసం కరాటే మార్షల్ ఆరట్స్ నేర్చుకోవాలని కోరారు. గత కొన్నేళ్ల నుంచి మాస్టర్ జహంగీర్ పాషా ఖాద్రీ వి ద్యార్థులకు, యువతకు కరాటే శిక్షణ ఇస్తుండడం అభినందనీయమన్నారు. ఈ సంద ర్భంగా బాలికలకు బెల్టులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగిర్ పాషా ఖాద్రీ,  ఆర్‌ఎల్సీ ఖాజా బా హుద్దీన్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఎండి సలీం, జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధి చెన్న వీరయ్య, ఆయా మైనార్టీ బాలికల గురుకులాల ప్రిన్సిపల్స్ లక్ష్మి, శ్రీదేవి, సురేఖ, పీఈటీలు పాతిమా బేగం, అనూష, చైతన్య, రాణి , బ్లాక్ బెల్ట్ విద్యార్థులు మారియా బేగం, నేహా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.