17-03-2025 01:51:00 AM
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నల్లగొండ, మార్చి 16 (విజయక్రాంతి) : పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో 34 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 9 లక్షల 45 వేల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరి రక్షణకు సీఎంఆర్‌ఎఫ్ వరంలాంటిదన్నారు. నిరుపేదలు ఆర్థిక ఇబ్బంది లేకుండా అధునాతన వైద్యసేవలు పొందేందుకు సీఎం సహాయ నిధి దోహదం చేస్తున్నదని పేర్కొన్నారు.