calender_icon.png 25 February, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయ క్రీడలపై రాష్ర్ట ప్రభుత్వం చిన్నచూపు

25-02-2025 01:24:25 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): సాంప్రదాయ క్రీడాలపై రాష్ర్ట ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఖోఖో ప్రపంచ కఫ్ లో ఇండియా టీమ్ నుండి ప్రాతినిధ్యం వహించి, వరల్డ్ కప్ సాధించిన ఆదిలాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ కు చెందిన క్రీడాకారుడు శివారెడ్డి ని సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ  తెలుగు తేజం శివారెడ్డి జాతీయ జట్టులో రాణించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో జోగు ఫౌండేషన్ ముందుంటుందని కొనియాడారు.

అలాగే రాష్ర్ట ప్రభుత్వం ఖోఖో క్రీడాలపై చిన్న చూపు చూస్తుందని, కనీసం ఇప్పటి వరకు ప్రపంచ కప్ గెలిచి వచ్చిన ఖోఖో జట్టు క్రీడాకారులను  గుర్తించకపోవడం వారు చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు సాజిదోద్దీన్, దమ్మ పాల్, సతీష్, విట్టల్, శివ కుమార్, రాహుల్, ఇబ్రహీం, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.