05-02-2025 07:23:23 PM
భద్రాచలం (విజయక్రాంతి): ఇటీవల జరిగిన U19 మహిళల టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో మొట్టమొదటి సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండవ సారి భారత్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాచలం పట్టణానికి చెందిన గంగోడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు చోరవతో కోటి రూపాయల నగదు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, దీంతో భద్రాచలం పట్టణంలో హార్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కోటి రూపాయల నగదు బహుమతి అందజేయటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.