calender_icon.png 27 April, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

26-04-2025 08:49:16 PM

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్...

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్, మాజీ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని పట్టణంలో శనివారం నిర్వహించిన  సన్నాహాక బైక్ ర్యాలీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరిట ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆన్నారు. 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మూడు సంవత్సరాలు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వచ్చే రెండు దశాబ్దాలు రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు  వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అవినీతి లక్ష్యంగా పాలనను పడకేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని కాంగ్రెస్ అధికారంలో చేపట్టిన తర్వాత నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాలేదని ఆయన ఆరోపించారు.

నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ గెలిచిన అనంతరం హామీల అమలు మరిచి మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసారని మండిపడ్డారు. నియోజకవర్గంలో వ్యవసాయ యూనివర్సిటీ, మైనింగ్ కాలేజ్ ఏర్పాటు, యువతకు 45 వేల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయకపోగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇప్పటికీ పంపిణీ చేయడం లేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, నియోజకవర్గంలో ఇచ్చిన హామీల అమలు కొరకు బిఆర్ఎస్ ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ లో జరగనున్న బిఆర్ఎస్ రజతో త్సవ సభను నియోజకవర్గం ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్, మాజీ జెడ్పిటిసి సభ్యులు వేల్పుల రవి, మాజీ వైస్ ఎంపీపీ లౌడం రాజ్ కుమార్ పట్టణ నాయకులు జె రవీందర్, బండారి సూరిబాబు అబ్బాస్, తిరుపతిరెడ్డి తోట సరేందర్, బట్టు రాజ్ కుమార్, బర్ల సదానందం, సీపెళ్లి సాగర్ లు పాల్గొన్నారు.

తరలివచ్చిన మండల నాయకులు

మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎల్కతుర్తి సభ సన్నాహక సమావేశానికి మండలంలోని బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార చేపట్టి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఇచ్చిన హామీలు అమలులో పూర్తిగా విఫలమైందన్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రజతోత్సవ సభలో చర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలు రూపొందించడం జరుగు తుందని మండలంలోని ప్రజలు, కార్యకర్తలు నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్ గౌడ్, ఫిరోజ్, పెంచాల మధు, సంకే శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.