calender_icon.png 22 January, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

22-01-2025 07:33:27 PM

కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం...

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందని దీనిలో భాగంగానే గ్రామసభలు నిర్వహించి నాలుగు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కురువ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని నార్లపూరులో గ్రామసభను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామసభల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరా మహిళలు ఇందిరా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు రైతు భరోసా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

లబ్ధిదారుల జాబితాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అర్హులైన లబ్ధిదారులకు ప్రతి సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తానన్నారు. అనంతరం నూతనంగా రేషన్ కార్డు అప్లికేషన్స్, రేషన్ కార్డులో నూతన పేర్లను చేర్చడం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులను స్వీకరించారు. అప్లికేషన్స్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అంకం రాజ్ కుమార్, నాయకులు గోపతి శ్రీనివాస్, చేగొండ శంకరయ్య, బోలిశెట్టి వేణు, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగుల బీరయ్య, మున్సిపల్ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.