04-03-2025 07:21:50 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) క్రింద ధరఖాస్తుదారులకు 25% రాయితిని ప్రకటించిందని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రోత్సాహం లే-అవుట్ రెగ్యులరైజేషన్ కోరుకునే భూ యజమానులకు ఆర్ధిక ఊరటను అందించడానికి ఉద్దేశించబడినది. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020 కింద ఇప్పటికే 1000/- చెల్లించి దరఖాస్తు చేసుకున్న, పెండింగ్ లో ఉన్న దరఖాస్తుదారులకు 25% రాయితీని ప్రకటించింది.
పరిమిత కాలం ఈ అవకాశాన్ని పొందడానికి చివరి తేదీ 31.03.2025 లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించండి. ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ తేదీ 26.08.2020కి ముందు కనీసం 10% లేఔట్ ప్లాట్లు విక్రయించిన భూ యజమానులు, మిగిలిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ లావాదేవీలకు 31.03.2025 వరకు 25% రాయితీ వర్తిస్తుంది. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.