బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవా రం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తొమ్మిదిన్నరేళ్లు రియల్ ఎస్టేట్ రంగం రయ్మని దూ సుకపోయిందని, కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై అంటోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో రియల్ బూమ్ కొనసాగిందని, కానీ కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఆగిపోయిందని నిలదీశారు. కేవ లం పరిపాలనా దక్షత లోపం, విజన్ లేని పాలనా విధామనమని మండిపడ్డారు. రి యల్ రంగంపై హైడ్రా వేటు పడిందని అ న్నారు. ముందు చూపు లేని నిర్ణయాలతో ఆదాయంపై పోటు పడిందని పేర్కొన్నారు.