calender_icon.png 19 March, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడ్తాల్ లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ పర్యటన

19-03-2025 04:51:13 PM

రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలల తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి...

కడ్తాల్ (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో తెలంగాణ ఫుడ్ కమిషన్ బృందం, జిల్లా అధికారులు బుధవారం పర్యటించారు. పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే భోజనంతో పాటు కూరగాయలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో కోడి గుడ్లు బాగాలేవని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... రేషన్ షాప్ లో కంప్లెట్ బాక్స్ లు లేవని వినియోగదారులు పిర్యాదు ఎలా చేస్తారన్నారు.

వెంటనే పిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీలలో ఎగ్స్ చిన్నగా ఉన్నాయని నాణ్యత లేని గుడ్లు పెడితే చర్యలు తప్పవన్నారు. కస్తూర్బా గాంధీలో తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పాఠశాలలో నాణ్యతమైన ఆహారం విద్యార్థులకు పెడితే ఫుడ్ కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిటిడిఓ రమాదేవి, డీఎస్ఓ శ్రీనివాస్, తహశీల్ధార్ ముంతాజ్ బేగం, ఎంపిడిఓ సుజాత, ఏటిడివో వెంకటయ్య, స్థానిక మాజీ సర్పంచి లక్ష్మీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.